ప్రిన్స్, నరేష్ అగస్త్య లీడ్ రోల్స్‌లో శివ శేషు తెరకెక్కించిన చిత్రం ‘కలి’. కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో లీలా గౌతమ్ వర్మ నిర్మించారు. అక్టోబర్ 4న సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు శివ శేషు మాట్లాడుతూ ‘పురాణాల్లోని కలి పురుషుడి పాత్ర స్ఫూర్తితో తీసిన ఫిక్షన్ మూవీ ఇది.
ఇందులో అతి మంచితనం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆత్మహత్యకు సిద్ధమైన శివరామ్ అనే పాత్రలో ప్రిన్స్ నటించాడు. అతని ఇంటికి వచ్చే అపరిచిత వ్యక్తిగా నరేష్ అగస్త్య కనిపిస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటనేది కథ. ఫిలిం సిటీలో వేసిన సెట్‌లో ఎక్కువ భాగం షూటింగ్ చేశాం.
రెండు పాత్రల మధ్య జరిగే కథ అయినప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా ఉంటుంది. లవ్ స్టోరీ కూడా ఉంది. నేహా కృష్ణన్ హీరోయిన్. బల్లి పాత్రకు ప్రియదర్శి వాయిస్ ఇచ్చారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమా ఇది. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో 70శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదు అనే సందేశం అంతర్లీనంగా చెప్పాం’ అని తెలిపాడు.