
నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జంటగా విపిన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఉమా దేవి కోట నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రానికి ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో నరేష్ అగస్త్య, రబియా ఖటూన్ జంట ఆకట్టుకుంది. పోస్టర్‌లోని పొగమంచు, గిటార్, ప్రశాంతమైన నేపథ్యంతో ఇదొక బ్యూటిఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా ఉండబోతోందని అర్థమవుతోంది. టైటిల్, ఫస్ట్ లుక్‌తో ఆసక్తి కలిగించిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.
రాధిక శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా సుమన్, ఆమని, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకుమాను ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
Some love stories are written with music... 🎻💕
— Madhura Sreedhar Reddy (@madhurasreedhar) March 27, 2025
Wishing best to the team of #𝐌𝐞𝐠𝐡𝐚𝐚𝐥𝐮𝐂𝐡𝐞𝐩𝐩𝐢𝐧𝐚𝐏𝐫𝐞𝐦𝐚𝐊𝐚𝐭𝐡𝐚 – A soulful journey of love 🎶🎼
Starring @nareshagastya & @rabiyaakhatoon ❤️
Directed by @vipinshivanand
Produced by @umadevikota on… pic.twitter.com/VOpa1uPLXF
నరేష్ అగస్త్య మూవీస్:
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలతో కూడిన లిమిటెడ్ బడ్జెట్ మూవీస్‌తో నటుడిగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు నరేష్ అగస్త్య. మత్తువదలరా మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు నరేష్ అగస్త్య. వికటకవి వెబ్ సిరీస్, కలి, మాయలో, కిస్మత్, మెన్ టూ, పంచతంత్రంతో పాటు మరికొన్ని తెలుగులో సినిమాల్లో హీరోగా కనిపించాడు.