Vikkatakavi: ఊహ‌కు అంద‌ని ట్విస్ట్‌లతో డిటెక్టివ్ థ్రిల్ల‌ర్ 'వికటకవి' వెబ్‌సిరీస్ ట్రైలర్..స్ట్రీమింగ్ డేట్ ఇదే

Vikkatakavi: ఊహ‌కు అంద‌ని ట్విస్ట్‌లతో డిటెక్టివ్ థ్రిల్ల‌ర్ 'వికటకవి' వెబ్‌సిరీస్ ట్రైలర్..స్ట్రీమింగ్ డేట్ ఇదే

న‌రేష్ అగ‌స్త్య‌ (Naresh Agastya), మేఘా ఆకాష్ (Megha Akash) కీల‌క పాత్ర‌ల్లో నటించిన డిటెక్టివ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ 'విక‌ట‌క‌వి' (Vikkatakavi). ఈ వెబ్ సిరీస్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఫ‌స్ట్ టైమ్ ఓ డిటెక్టివ్ వెబ్‌సిరీస్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుండటంతో ఆడియన్స్లో అంచనాలు పెరిగిపోయాయి.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో విక‌ట‌క‌వి వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్కి రాబోతుంది. ఈ సిరీస్కు ప్ర‌దీప్ మ‌ద్దాలి ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా.. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తాజాగా (నవంబర్ 7న) ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

విక‌ట‌క‌వి ట్రైలర్::

'మధ్యరాత్రి దేవతల గుట్టమీదికి పోయి ఈ లాంతరు చుపియ్.. అంటూ మొదలై విక‌ట‌క‌విపై ఇంటెన్స్ కలిగించారు. ఇక ఆ తర్వాత యూనివర్సిటీలో ఓ మర్డర్.. అక్కడ ఉన్న ప్రొఫెసర్ డిటెక్టివ్ న‌రేష్ అగ‌స్త్య‌కి తన ఊరిలో ఉన్న సమస్యను సాల్వ్ చేయడానికి నువ్వు వెళతావని అడగడంతో అడవికి ఎంట్రీ అవుతాడు. ఆ గ్రామంలో ఉన్న పూజారి ఇది అమ్మోరు శపించిన ప్రాంతమని చెప్పి..'విక‌ట‌క‌వి' థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ అని అర్ధమయ్యేలా చేశారు మేకర్స్. మరి ఆ ఊరికి ఉన్న సమస్య ఏంటీ? దాన్ని ఎలా కనుగొన్నారు? ఈ క్రమంలో డిటెక్టివ్ న‌రేష్ అగ‌స్త్య‌కు ఎదురైనా సవాళ్లేంటీ? అనే సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ట్రైలర్ సాగింది.

విక‌ట‌క‌వి ఓటీటీ::

డిటెక్టివ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ 'విక‌ట‌క‌వి' న‌వంబ‌ర్ 28న జీ5 లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సీరీస్ ఆడియన్స్ ఊహ‌కు అంద‌ని ట్విస్ట్‌లతో, తెలంగాణ యాస, భాష‌ల‌తో సాగనున్నట్లు సమాచారం.

హీరో న‌రేష్ అగ‌స్త్య‌ జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన సినిమాలతో, వెబ్ సిరీస్ తో దూసుకెళ్తున్నారు. మ‌త్తువ‌ద‌ల‌రా సినిమాలో పాజిటివ్‌గా క‌నిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్‌తో యాక్టర్గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు.

ఆ త‌ర్వాత కిస్మత్, మెన్ టూ, హ్యాపీ బ‌ర్త్‌డే, సేనాప‌తి,పంచతంత్రం, పరువు, కలితో పాటు ప‌లు సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేసి అలరిస్తున్నాడు. ఇక ఈ సిరీస్లో  డిటెక్టివ్ రామ‌కృష్ణ పాత్ర‌లో న‌రేష్ అగ‌స్త్య కనిపించనున్నారు.

విక‌ట‌క‌వి స్టోరీ లైన్::

ఇప్పటికీ తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ, పీరియాడిక్ జోనర్లో వస్తోన్న థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక స్టోరీ విషయానికి వస్తే..హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని 'అమరగిరి' అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఏదో శక్తి రూపంలో ఉండే  ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. దాంతో ఆ గ్రామాల చుట్టూరా ఉన్న ప్రజల్లో ఏదో తెలియని భయం వెంటాడుతుంటుంది. ఇక ఈ ప్రాంతంలో ఉన్న భయాన్ని, అక్కడ నెలకొన్న స‌మ‌స్య‌ను సాల్వ్ చేయడానికి డిటెక్టివ్ రామకృష్ణ ఆ ఊరికి వెళ‌తాడు. ఇక తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసి అమరగిరి ప్రాంతాన్ని భయపెట్టేది.. కనబడని శక్తి హ ? లేక ముసుగువేసుకున్న మనుషులా? అక్కడ ఉన్న రహస్యాలను వెలికితీసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లేంటీ ? అసలు మేఘ ఆకాష్ ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.