బాలివుడ్ నటి నర్గీస్ సోదరి అలియా ఫక్రీ అరెస్ట్​

బాలివుడ్ నటి నర్గీస్ సోదరి అలియా ఫక్రీ అరెస్ట్​

బాలివుడ్ నటి నర్గీస్ సోదరి అలియా ఫక్రీ అరెస్ట్​
అదుపులోకి తీసుకున్న న్యూయార్క్ పోలీసులు

న్యూయార్క్: బాలివుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియా ఫక్రీ అమెరికాలో అరెస్టయ్యారు. జంట హత్య కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. తన మాజీ బాయ్​ఫ్రెండ్, అతని స్నేహితురాలు కలిసి ఉండగా అలియా వారిని సజీవ దహనం చేసినట్లు ఆరోపణలున్నాయి. కొద్దిరోజుల కింద జరిగిన ఈ ఘటనలో అలియాను ప్రధాన ముద్దాయిగా పోలీసులు నిర్ధారించారు. న్యూయార్క్​లో ఉంటున్న అలియా ఫక్రీ కొంతకాలంపాటు ఎడ్వర్డ్ జాకోబ్ అనే యువకుడితో రిలేషన్​షిప్​లో ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది కిందే విడిపోయారు. 

ఆపై జాకోబ్ మరో యువతి ఎటినీతో రిలేషన్​షిప్ మొదలు పెట్టాడని తెలియడంతో అలియా పలుమార్లు అతడిపై బెదిరింపులకు పాల్పడ్డారు. అదే క్రమంలో గత నెల నవంబర్ 2న జాకోబ్, అతడి స్నేహితురాలు ఎటినీ ఉంటున్న గ్యారేజీ వద్దకు వెళ్లి ఆ ఇంటికి నిప్పంటించారు. దీంతో ఇద్దరూ మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఆధారంగా అలియా ఫక్రీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె దోషిగా తేలితే జీవిత ఖైదు పడే అవకాశముంది. కేసు విచారణ ఈ నెల 9న జరగనుంది.