
ఐపీఎల్ టోర్నీ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రాణించారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ పై ఫస్ట్ హాఫ్ లో విఫలమైనా..ఆ తర్వాత బౌలర్లు తిరిగి పుంజుకున్న తీరు అద్భుతం. బెంగళూరు బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ ఓపెనర్ సునీల్ నరైన్ తన మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. 26 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్ లో నరైన్ బ్యాట్ ను వికెట్లకేసి కొట్టడం వైరల్ గా మారుతుంది. దీంతో నెటిజన్స్ ఔట్ అనే అభిప్రాయానికి వస్తున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ALSO READ | KKR vs RCB: రహానే కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు ముందు ఛాలెంజింగ్ టార్గెట్
ఇన్నింగ్స్ 8 ఓవర్ నాలుగో బంతికి నరైన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రసిఖ్ దార్ సలాం వైడ్ బాల్ వేశాడు. ఆ తర్వాత నరైన్ బ్యాట్ వికెట్లను తగిలింది. స్టంప్స్ కింద పడడంతో ఔట్ అనే అభిప్రాయానికి వచ్చారు. బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ పటిదార్ జట్టును అవుట్ కోసం అప్పీల్ చేయమని కోరుతున్నట్లు కనిపించాడు. టిమ్ డేవిడ్ కూడా అవుట్ కోసం అప్పీల్ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు అనిపించింది. మొత్తానికి ఆర్సీబీ అంపైర్ కు అప్పీల్ చేయకుండా వేదిలేసింది.
ఆర్సీబీ అప్పీల్ చేస్తే నరైన్ త్వరగా ఔటయ్యేవాడని ఫ్యాన్స్ భావించారు. కానీ రూల్స్ ప్రకారం ఒకవేళ అప్పీల్ చేసినా నాటౌట్ గా ప్రకటించేవారు. ఎందుకంటే అంపైర్ బంతిని వైడ్ అని ప్రకటించడంతో బంతి అప్పటికే డెడ్ అయినట్లు అర్ధం. తర్వాత జరిగిన సంఘటనలను ఆటలో పరిగణనలోకి తీసుకోరు. అందువల్ల బెంగళూరు జట్టు హిట్ వికెట్ కోసం అప్పీల్ చేసినా నాటౌట్ అయ్యేది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే కెప్టెన్ అజింక్య రహానే, సునీల్ నరైన్ మెరుపులు మెరిపించడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది
Lol Lockdown kid Crying over Sunil Narine hit on wicket 😭🤣
— 𝑷𝒆𝒂𝒄𝒆𝒇𝒖𝒍 𝑻𝒉𝒐𝒖𝒈𝒉𝒕 (@Peaceful_Th) March 22, 2025
Lol Narine wasn't hit wicket bcs he hitted the wicket after the ball being bowled and not while playing it.#IPL2025 #RCBvsKKR pic.twitter.com/1Q20tktcBJ