ఈమధ్యకాలంలో కొందరు కేటుగాళ్లు ఇతరుల అవసరాలని ఆసరా చేసుకుని ఆర్థికమోసాలకి పాల్పడుతున్నారు. అయితే కొందరు సినిమా ఆఫర్లు పేరుతో జూనియర్ ఆర్టిస్టుల దగ్గర వసూలు చేస్తున్న ఘటన కేరళలోని త్రిసూర్ లో వెలుగు చూసింది
పూర్తివివరాల్లోకి వెళితే మలయాళ ప్రముఖహీరో టోవినో థామస్ ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ అనురాజ్ దర్శకత్వం వహిస్తున్న నారివెట్ట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. దీంతో దర్శకుడు అనురాజ్ జూనియర్ ఆరిస్టులకోసం క్యాస్టింగ్ కాల్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్టిస్టులు కోసం వాట్సాప్ ఫేస్ బుక్ వంటి ప్లాట్ ఫార్మ్స్ లో ప్రకటన ఇచ్చారు.
దీంతో కొందరు ఇదే అదునుగా చేసుకుని సినిమాలో అఫర్ ఇస్తామని, ఇందుకుగాను రూ.1000, రూ.2000 ముందుగానే డిపాజిట్ గా చెల్లించాలని నమ్మబలికి అమాయకుల దగ్గర డబ్బు వసూలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు అనురాజ్ చాకచక్యంగా, డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాళ్లని పట్టుకుని పోలీసులకి అప్పగించారు. ఇలాంటివారి కారణంగా జూనియర్ ఆర్టిస్టులు దొరకడం లేదని దీంతో షూటింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.