నార్కట్ పల్లి హైవేపై కారులో రూ. 10 లక్షలు సీజ్

నల్గొండ జిల్లాలో పోలీస్ అధికారులు 2024 మార్చి 21న గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. వాహనాలను ఎక్కడికక్కడ ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నార్కట్ పల్లిలో భారీగా నగదు పట్టుబడింది. వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ కారులో ఎటువంటి ఆధారాలు లేకుండా రూ. 10 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు.  అయితే డబ్బులకు  సంబంధించిన లెక్కలు చూపించకపోవడంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు. వాటిని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అప్పగించారు.

అటు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోనూ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా బైక్ లో తరలిస్తున్న రూ. 3 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు.

Also Read :మెదక్ బరిలో హరీశ్ రావు.!