నార్కట్​పల్లి ఎస్సై సస్పెన్షన్​

నల్గొండ అర్బన్, వెలుగు: నార్కట్ పల్లి ఎస్సై సైదాబాబు  సస్పెండ్ అయ్యారు.  నార్కట్​పల్లి పీఎస్ పరిధిలో పేకాటరాయుళ్లకు సపోర్ట్ చేస్తున్నట్లు ఇటీవల నల్గొండ నుంచి బదిలీ అయిన ఎస్పీ అపూర్వరావుకు ఆధారాలతో ఫిర్యాదులు వచ్చాయి.

స్పందించిన ఎస్పీ నాలుగు రోజుల కింద సైదాబాబును వీఆర్​కి అటాచ్ చేశారు. చిట్యాల, మర్రిగూడం మండలాల్లో పేకాటను ప్రోత్సహిస్తూ అవినీతికి పాల్పడినట్లు ఉన్నతాధికారులకు రిపోర్టు ఇచ్చారు. దీంతో ఎస్సై సైదాబాబును ఐజీ తరుణ్​జోషి సస్పెండ్ ​చేశారు. మిర్యాలగూడలో పనిచేసే టైంలో సైదాబాబు ఇప్పటికే ఒకసారి సస్పెండ్ అయ్యారు.