ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నాయకులు

నార్కట్​పల్లి, వెలుగు : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆదివారం నార్కట్​పల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నేతగాని కృష్ణయ్య, నాయకులు గడుసు శశిధర్ రెడ్డి, వాడాల రమేశ్, మల్గ శంకర్, గాదరి వెంకన్న, వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.