
కామెడీ మూవీ ‘మ్యాడ్’ సెన్సేషనల్ హిట్ సీక్వెల్‌గా వస్తోన్న సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square).ఈ మూవీ ఉగాది సందర్భంగా మార్చి 29న రిలీజ్ కానుంది. లేటెస్ట్గా మార్చి 26న ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘మ్యాడ్’లో చూసిన దాని కంటే ఎక్కువ ఫన్, ఆడియన్స్ ఊహించేదాని కంటే ఎక్కువ మ్యాడ్‍నెస్ ఇందులో ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. సీక్వెల్ కూడా అంతకు మించి ఉంటుందనేలా ట్రైలర్ లో డైలాగ్స్ అదిరిపోయాయి.
ఇటీవలే ఈ మూవీ నుంచి వచ్చిన స్వాతి రెడ్డి సాంగ్ తో సహా టీజర్ విజువల్స్ అంచనాలు పెంచేశాయి. మొదటి భాగం కాలేజీ, లవ్ లైఫ్ బ్యాక్ డ్రాప్ లో ఉండగా మ్యాడ్ స్క్వేర్ మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ & కామెడీ ఎంటర్టైనర్గా గోవా బ్యాక్ డ్రాప్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
మురళీధర్ గౌడ్ కొడుకు కోసం గోవాకి రావడం, అక్కడొచ్చే ఫన్నీ ఇన్సిడెంట్స్, సరదా డైలాగ్స్ తో ట్రైలర్ నిండిపోయింది. చివర్లో సత్యం రాజేష్, డైరెక్టర్ అనుదీప్ కేవీ, గెస్ట్ రోల్ లో కనిపించారు. ఇక చివరగా భాయ్ అనే వాయిస్ తో ఫోన్ రావడం, నేను గర్ల్స్ అయితేనే మాట్లాడుతా అని రిటర్న్ లో డైలాగ్ రావడం మరింత అట్ట్రాక్ట్ చేస్తుంది.
Also Read:-జపాన్లో భార్య ప్రణతి బర్త్డే సెలబ్రేషన్స్..
ముఖ్యంగా పెళ్లికి మూడు రోజులు ఉండగా గోవాకి వెళ్లి ఎంజాయ్ చేసే కాన్సెప్ట్, కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో గోవా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు బాగానే హిట్ అయ్యాయి. దీంతో మ్యాడ్ స్క్వేర్ డబుల్ ఫన్ అందిస్తుందని చెప్పవచ్చు.
ఇందులో హీరో హీరోయిన్లుగా సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియా, గోపిక ఉదయన్, అనంతిక తదితరులు నటించారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు.
సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. ఇకపోతే ఈ మూవీకి పోటీగా నితిన్ నటించిన రాబిన్ హుడ్ మూవీ థియేటర్లలలో సందడి చేయనుంది.