
వరంగల్ : నర్సంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ దొంతి మాధవరెడ్డి పాదయాత్ర చేపట్టారు. దుగ్గొండి మండలం కేశవపూర్ నుండి పాదయాత్ర ప్రారంభించారు. దొంతి మాధవరెడ్డి నర్సంపేట నియోజకవర్గంలోనే ఉన్నా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సహకరించలేదనే చర్చ నడుస్తోంది. ఈరోజు నర్సంపేటలో జరగాల్సిన రేవంత్ రెడ్డి పాదయాత్ర మహబూబూబాద్ లో కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి పాదయాత్రకు సహకరించకపోవడం పట్ల పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం మహబూబూబాద్ లో రేవంత్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గంలో దొంతి మాధవరెడ్డి పాదయాత్ర చేస్తున్నారు.