నర్సంపేట / నెక్కొండ, వెలుగు : వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమస్యలు పరిష్కరించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను గురువారం కలిశారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్‌తో కలిసి రైల్వే మంత్రితో భేటీ అయ్యారు. నెక్కొండ రైల్వే స్టేషన్ ఏడు మండలాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని, శాతవాహన, చార్మినార్, నవజీవన్, షిర్డీ, కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు
ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ, మెమోరాండం అందజేశారు. దీంతో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, రైల్వే స్టేషన్ సమ్యలపై చర్యలు తీసుకోవాలని జీఎంను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్‌రావు, పర్వతగిరి మాజీ జడ్పీటీసీ బానోతు సింగూలాల్ ఉన్నారు.