భూ కబ్జాదారుడికి టికెటా..? నర్సాపూర్ బీజేపీ అభ్యర్థిపై అసమ్మతి సెగలు

భూ కబ్జాదారుడికి టికెటా..? నర్సాపూర్ బీజేపీ అభ్యర్థిపై అసమ్మతి సెగలు

నర్సాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళి యాదవ్ పై సొంత పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ మార్చాలంటూ బీజేపీ ఆఫీస్ ముందు కార్యకర్తలు ధర్నాకు దిగారు. గోపికి కాకుండా మురళి యాదవ్ కి టికెట్ ఇవ్వడంపై కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్ బీజేపీని కాపాడాలి  అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. తాము 27 ఏళ్లుగా బీజేపీ పార్టీలోనే ఉంటున్నామని, గతంలో ఆర్ఎస్ఎస్​లోనూ పని చేశామన్నారు గోపి (టికెట్ ఆశించిన నేత). భూ కబ్జాదారుడికి నర్సాపూర్ బీజేపీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 

బీజేపీలోని కొంతమంది పెద్దలు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని గోపి ఆరోపించారు. తెలంగాణ బీజేపీని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. బాధతోనే పార్టీ కార్యాలయం ముందు నిరసన చేస్తున్నామని చెప్పారు.