శివ్వంపేట, వెల్దుర్తి, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ లీడర్ల భూభాగోతాలు బయట పెడతామని నర్సాపూర్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం చిన్న గొట్టిముక్కుల, టిక్యా దేవమ్మ గూడ తండా, చెన్నాపూర్, పెద్ద గొట్టిముక్కుల, లచ్చిరెడ్డిగూడెం, రెడ్యా తండా, నవాపేట్, తిమ్మాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు శివ్వంపేట మండలం సికింద్లాపూర్లో అనేక ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న 500 ఎకరాలు అక్రమంగా బినామీల పేర్లతో పట్టా చేయించుకున్నారని ఆరోపించారు.
కొంతాన్ పల్లిలో సైతం భూకబ్జాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయా భూములన్నీ రైతులకు పంచుతామన్నారు. అనంతరం చౌరస్తా నుంచి పోతుల గూడ వరకు ఉన్న రోడ్డు అధ్వాన్నంగా మారి రాకపోకలకు ఇబ్బంది ఉన్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, నాయకులు సుహాసిని రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నవీన్ గుప్తా, పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, మాజీ జడ్పీటీసీ కమలాపూల్ సింగ్, నాయకులు రవీందర్ గౌడ్, రమేశ్ గౌడ్, గణేశ్, మల్లేశ్, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
ALSO READ : తెలంగాణలో స్వేచ్ఛగా ఓటు వేయాలి : కలెక్టర్ శరత్
రాజిరెడ్డి భార్య ప్రచారం..
కాంగ్రెస్ నర్సాపూర్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి భార్య శైలజా రెడ్డి వెల్దుర్తి పరిధిలోని కుకునూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలకు బొట్టు పెట్టి చేయి గుర్తుకు ఓటేసి తన భర్తను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, తలారి మల్లేశం, వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, నరసింహారెడ్డి పాల్గొన్నారు.