
నర్సాపూర్, వెలుగు : నర్సాపూర్ మున్సిపాలిటీలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తమకు పింఛన్ రావడంలేదని మూడు రోజులుగా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఎంపీడీవో ఆఫీసుకు వచ్చి అడుగగా తమకు సంబంధం లేదని, మున్సిపల్ ఆఫీసులో అడగగా కమిషనర్ లేడని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆఫీసర్లు సరైన సమాచారం ఇవ్వడంలేదని ఆరోపించారు.