
కంది, వెలుగు : కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక సంక్షేమాన్ని మరిచి వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు ఆరోపించారు. బుధవారం సంగారెడ్డి మండల పరిధిలోని నాగపూర్, ఇరిగిపల్లి, కల్పగూర్ గ్రామాల్లో పర్యటించి గ్రామీణ బంద్ కరపత్రాన్ని విడుదల చేశారు.
దేశంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈనెల 16న దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు చెప్పారు. సమ్మెను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.