మహిళపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ నార్సింగి పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
ఫోక్స్ కేసులో అరెస్టయిన జానీకి అక్టోబర్ 6 నుంచి 9 వరకు రంగారెడ్డి జిల్లా కోర్టు జానీకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే నేషనల్ అవార్డ్ నిలిపివేసింది కమిటీ. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. జానీ మళ్లీ రిమాండ్ కు వెళ్లే అవకాశం ఉంది. 2022 సంవత్సరానికి గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీకి నేషనల్ అవార్డ్ వచ్చింది. అక్టోబర్ 8న జానీ ఈ అవార్డ్ అందుకోవాల్సి ఉంది.
Also Read :- నవదుర్గ ఉత్సవాల్లో .. బీజేపీ ఎంపీ హేమమాలిని డ్యాన్స్
తనను పలుమార్లు అత్యాచారం చేసినట్లు సెప్టెంబర్ లో బాధితురాలు నార్సింగి పీఎస్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. ఫోక్స్ కేసు నమోదు చేసిన పోలీసులు జానీని అరెస్ట్ చేశారు. కోర్టు 14 రిమాండ్ విధించింది.ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నాడు.