లావణ్య రాజ్ తరుణ్ ల వివాదం ఆ మధ్య టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. గతంలో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం ( ఫిబ్రవరి 3, 2025 ) మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య .
పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి.ప్రైవేట్ గా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. తనకు చెందిన కొన్ని వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేశాడని పేర్కొన్న లావణ్య.. వీడియోలను పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200 వీడియోలకు పైగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.
ALSO READ | ఆస్తి తగాదాలు..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు మంచు మోహన్ బాబు, మనోజ్
గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు మస్తాన్ సాయి. అంతే కాకుండా గతంలో ఏపీలో కూడా డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి మస్తాన్ సాయి అరెస్టుతో మళ్ళీ తెరపైకి వచ్చిన లావణ్య రాజ్ తరుణ కేసులో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి చూడాలి.