RajTarun-Lavanya Case: లావణ్యతో పదేళ్లు కలిసే ఉన్నాడు..రాజ్ తరుణ్ పై పోలీస్ కేస్

హీరో రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్ లో తాజాగా మరో ట్విస్ట్ మొదలైంది. రాజ్ తరుణ్ పై పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తూ..అతనిపై  కేసు నమోదు చేశారు. తనను ప్రేమించి, మోసం చేశారని లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని పోలీసులు తేల్చేశారు.

లావణ్య- రాజ్‌తరుణ్‌ పదేళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించి కేసు విచారణలో భాగంగా లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు, పలు కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు వారు పేర్కొన్నారు.

ఈ కేసు విషయంలో లావణ్య చెప్తున్నదాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. మరో వైపు ఈ కేసులో రాజ్ తరుణ్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు.

మరి ఈ లేటెస్ట్ ఎపిసోడ్ తో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకోనుందో తెలియాల్సి ఉంది. కాగా రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడు మూవీ రేపు (సెప్టెంబర్ 7న) థియేటర్లలలో రిలీజ్ కానుంది.