మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్.. కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు

మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్.. కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో కీలక నిందితుడు మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న మస్తాన్ సాయిని కోర్టు అనుమతించడంతో గురువారం (ఫిబ్రవరి 13) కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు రాబట్టనున్నారు నార్సింగి పోలీసులు.

సైబర్ నేరం, లైంగిక డాడీ, బ్లాక్ మెయిలింగ్ వంటి దురాగతాల కేసులో యూట్యూబర్ మస్తాన్ సాయి పై పలు అభియోగాలు ఉన్నాయి. రాజేంద్రనగర్ కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో  కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు విచారణ చేయనున్నారు. 

మస్తాన్ సాయి దగ్గర 300 మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయని, అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లావణ్య ఫిర్యాదు మేరకు సోమవారం ( ఫిబ్రవరి 3, 2025 ) మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదు మేరకు ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు, వివరాలు రాబట్టనున్నారు పోలీసులు.

పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ గా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. తనకు చెందిన కొన్ని వీడియోలను   మస్తాన్ సాయి రికార్డ్ చేశాడని పేర్కొన్న లావణ్య..  వీడియోలను పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 300 వీడియోలకు పైగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.