Aha OTT: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చిన తెలుగు ఎమోషనల్ డ్రామా థ్రిల్ల‌ర్‌

శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న లీడ్ రోల్స్‌‌‌‌లో రిషికేశ్వర్ యోగి రూపొందించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’ (Narudi Brathuku Natana). టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. అక్టోబర్ 25న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. 

ఇవాళ శుక్ర‌వారం (డిసెంబర్ 6న) ఈ మూవీ ఆహా ఓటీటీలో (Aha OTT) స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ డ్రామా థ్రిల్ల‌ర్ సైలెంట్గా ఓటీటీకి రావడంతో ఆడియాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీలోని కథ కథనాలు ప్రేక్షకుల మనసును కట్టిపడేశాయి. డ‌బ్బే స‌ర్వ‌స్వం అనుకునే ఓ యువ‌కుడి జీవితం తాలూకు విలువ‌ను, ఆనందాన్ని ఎలా తెలుసుకున్నాడ‌న్న‌ది ఇందులో నాచుర‌ల్‌గా చూపించారు.

డబ్బున్న కుటుంబంలో పుట్టి సకల సౌకర్యాలతో హాయిగా బ్రతికే యువకుడు.. అనుకోకుండా కేరళలోని తనకు తెలియని ప్రాంతానికి వెళ్తే అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.. తనకు ఎవరు తోడుగా నిలిచారు అనేది కథ. సత్యమే శివం, శివపుత్రుడు తరహాలో ప్రేక్షకులను ఒక మంచి అనుభూతికి, ఎమోషన్‌‌‌‌కు గురిచేసే చిత్రమిది.

ఇప్పటికే పలు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివల్స్‌‌‌‌లో ఈ సినిమాకు దాదాపు అరవై అవార్డ్స్ వచ్చాయి. 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు’లో విలన్‌‌‌‌గా నటించిన నితిన్ ప్రసన్న నటన చాలా సింపుల్ గా ఉంటుంది. అదేలా అంటే.. మన జీవితంలోనూ ఇలాంటి ఫ్రెండ్ ఉండాలని, మనుషులు ఇలా ఉంటే మన సమాజం ఎంతో బాగుంటుంది అనిపించేలా నితిన్ ప్రస పాత్ర ఉంటుంది.

Also Read : దేవరకొండ ఫ్యామిలీతో కలిసి పుష్ప 2 చూసిన రష్మిక

హ్యూమన్ ఎమోషన్స్ నేపథ్యంలో దర్శకుడు రిషికేశ్వర్ యోగి హార్ట్ టచింగ్‌‌‌‌గా తెరకెక్కించాడు. ఒక నటుడు అన్ని రకాల ఎమోషన్స్‌‌‌‌ను లైఫ్‌‌‌‌లో చూసుండాలి. అప్పుడే గొప్ప నటుడిగా ఎదుగుతాడు అనే అంశాన్ని ఈ కథలోని లీడ్ రోల్ ద్వారా చూపించిన ప్రయత్నం మెచ్చుకోదగినది. 

ఇకపోతే ఈ మూవీలో 'పోరాడు' (Poraadu) అనే సాంగ్ శ్రోతల్ని వీపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో చిత్రణ్ అందించిన సాహిత్యం కొత్త కలలు కనే వాళ్ళకి బలాన్ని ఇచ్చేలా ఉంది. సినిమా న‌టుడు కావాల‌న్న‌ ఓ యువకుడి ప్రయాణాన్ని.. డ‌బ్బే స‌ర్వ‌స్వం అనుకునే ఎన్నో కథలకి అర్ధం చెప్పేలా ఉన్న ఈ పాట ఆలోచింపజేస్తుంది.