SunitaWilliamsReturn: సునీతా విలియమ్స్.. మీ సాహసం ఎంతో గొప్పది.. సినీ ప్రముఖులు శుభాకాంక్షల వెల్లువ

SunitaWilliamsReturn: సునీతా విలియమ్స్..  మీ సాహసం ఎంతో గొప్పది.. సినీ ప్రముఖులు శుభాకాంక్షల వెల్లువ

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams)అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలల తర్వాత బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చారు. ఈ క్షణాలు అంతరిక్ష సమాజానికి మాత్రమే కాదు.. భారత దేశ ఉనికికి ఎంతో గర్వకారణం.

ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సునీతా విలియమ్స్ వెల్‌కమ్‌ చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి X వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 

Also Read:-మహేష్ మూవీ ఒడిషాలో ప్యాకప్.. రాజమౌళి నోట్..

"భూమికి తిరిగి స్వాగతం సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్! ఇది చారిత్రక వీరోచిత ఘట్టం. 8 రోజులు అంతరిక్షంలోకి వెళ్లి రావాలనుకుని వెళ్లి, 286 రోజుల తర్వాత భూమిని చేరుకున్నారు. ఆశ్చర్యకరమైన రీతిలో భూమి చుట్టూ 4577 సార్లు తిరిగి వచ్చారు! మీ కథ సాటిలేనిది. మీ సాహసం ఎంతో గొప్పది. నిజం చెప్పాలంటే మీ ప్రయాణం ఒక థ్రిల్లర్‌ అడ్వెంచర్‌ మూవీని మించి తలపిస్తోంది. నిజమైన నీలిరంగు బ్లాక్ బస్టర్!! ఆ దేవుడు మీకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్న" అని చిరంజీవి ఆశా భావం వ్యక్తం చేశారు. 

నటుడు ఆర్ మాధవన్ వీడియోను షేర్ చేశారు, అందులో సునీత తిరిగి వచ్చినప్పుడు కెమెరా వైపు ఊపుతూ కనిపించారు. "భూమికి తిరిగి స్వాగతం మా ప్రియమైన సునీతా విలియమ్స్. మా ప్రార్థనలకు సమాధానం లభించింది. మీరు సురక్షితంగా మరియు నవ్వుతూ ఉండటం చూడటం చాలా అద్భుతంగా ఉంది. దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలి" అని మాధవన్ కోరారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by R. Madhavan (@actormaddy)

"అంతరిక్షంలో తొమ్మిది నెలలు కొనసాగడానికి అసాధారణమైన ఓర్పు, అచంచలమైన స్థితిస్థాపకత మరియు అజేయమైన ఆవిష్కరణ స్ఫూర్తి అవసరం" అని నటుడు జాకీ ష్రాఫ్ నోట్ రాశారు.

సినీ నటులతో పాటు, సోషల్ మీడియాలో ప్రజలు, వ్యోమగాములపై ప్రశంసలు కురిపిస్తున్నారు, వారి ధైర్యసాహసాలు మరియు స్థితిస్థాపకతను ప్రశంసిస్తున్నారు. ఇకపోతే, ఈ మిషన్ లో విలియమ్స్ మరియు విల్మోర్ భూమిని 4,576 సార్లు చుట్టి, 195 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి సురక్షితంగా తిరిగి వచ్చారు