భూమి మీదకు బయలుదేరిన సునీత విలియమ్స్.. ఎక్కడ ల్యాండ్ అవుతారంటే

భూమి మీదకు బయలుదేరిన సునీత విలియమ్స్.. ఎక్కడ ల్యాండ్ అవుతారంటే

అంతరిక్షంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు భూమి మీదకు వచ్చేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. స్పేస్ ఎక్స్, నాసా సంయుక్తంగా నిర్వహించిన క్రూ 10 మిషన్ లో భాగంగా మార్చి 15న ఫాల్కన్ 9 రాకెట్ ను నింగిలోకి పంపారు. ఈ రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లడంతో సునీతా విలియమ్స్ రాకకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో ఆస్ట్రోనాట్ల రిటర్న్ షెడ్యూల్ ప్రకటించింది నాసా. మొదట మార్చి 19న సునీత విలియన్స్ భూమి మీదకు రానున్నారని పేర్కొన్న నాసా.. ఆ తర్వాత షెడ్యూల్ ని ఒకరోజు ముందుకు మార్చింది. దీంతో మంగళవారం ( మార్చి 18 ) సునీత విలియమ్స్ భూమి మీదకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్‌ఎక్స్‌ క్యాప్సూల్‌ ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి ఆస్ట్రోనాట్స్ ఒక్కొక్కరుగా బయటకు రానున్నారు. ఇదిలా ఉండగా.. సునీత విలియమ్స్ సహా ఇతర ఆస్ట్రోనాట్స్ ను భూమ్మీదకు క్షేమంగా తీసుకొచ్చేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది నాసా. క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ రిటర్న్ జర్నీలో స్పేస్ స్టేషన్ ఫోటోలు తీసిన 41నిమిషాల తర్వాత భూమి మీదకు బయలుదేరనుంది.

ఈ 41 నిమిషాల గ్యాప్ లో సోలార్ ప్యానల్స్ ద్వారా క్రూ డ్రాగన్ బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. క్రూ డ్రాగన్ భూమి మీద ల్యాండ్ అయ్యే ముందు థ్రస్టర్ ఆన్ అవుతుంది.. దీంతో క్యాప్సూల్ వేగం తగ్గి నెమ్మదిగా భూమ్మీదకు వస్తుంది. లాండింగ్ కి 3 నిమిషాల సమయం ఉండగా 3 ప్యారచూట్లు ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత క్యాప్సూల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవనుంది. ల్యాండింగ్ సైట్ దగ్గర సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్న స్పేస్ ఎక్స్ టీం ఆస్ట్రోనాట్లను ఒక్కొక్కరుగా బయటికి తీసుకొస్తుంది.