ఆ ఇల్లు ఏలియన్లదేనా ?!

అంగారకుడిపై రహస్య స్థావరాలు ఉన్నాయా ? అక్కడ ఏలియన్లు ఇళ్లను కట్టుకున్నారా ? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంగారకుడి ఫొటోల్లో కనిపిస్తున్నవి అవేనా ?  అనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మంది మదిలో ఉదయిస్తున్నాయి. పెద్ద ఎడారిలాంటి ప్రదేశం.. మధ్యలో ఒక గుట్ట.. అందులో దీర్ఘ చతురస్ర ఆకారంలో తలుపులాంటి ఆకారాన్ని చూసి అందరూ అవాక్కవుతున్నారు. అది అంగారకుడిపై ఉండే ఏలియన్ల షెల్టర్ జోనా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనిపై నెటిజన్ల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది.

నాసా ఏం చెప్పిందంటే..

ఈనేపథ్యంలో స్పందించిన నాసా ఆ ఫొటోలో కనిపిస్తున్నది బంకరా ? కాదా ? అనే దానిపై స్పష్టత ఇచ్చింది.‘‘ నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ గత పదేళ్లుగా అంగారకుడి చుట్టూ చక్కర్లు కొడుతోంది. దాని రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అక్కడి ఫొటోలను తీసి ఎప్పటికప్పుడు భూమికి పంపిస్తోంది. ఈక్రమంలోనే జజిరో బిలంపై పరిశోధన చేపట్టిన సమయంలో రోవర్ ‘సోల్స్ 3466 సిరీస్’ ఫొటోలను పంపింది. ఆ ఫొటోల్లో ఒక దాంట్లో.. ఓ రాయిపై ఏర్పడిన చీలికను చాలాచాలా జూమ్ చేస్తే ఈవిధంగా తలుపు లాంటి ఆకారంలో కనిపిస్తోంది’’ అని నాసా వివరించింది.దీంతో అవి రహస్య స్థావరాలు కానీ, ఇళ్లు కానీ కావని తేలిపోయింది.  

మరిన్ని వార్తలు.. 

బిహార్ లో భారీ గోల్డ్ మైన్

నేడు ఐపీఎల్‌ ఫైనల్‌