దీపావళి కాంతులు అంతరిక్షాన్ని తాకాయి.. అద్భుతం ఆవిష్కరణ

దీపావళి.. దేశ ప్రజలు అందరూ ఎంతో ఆనందంగా చేసుకున్నారు. భూమిపై వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు అందరూ ఘనంగా చేసుకున్నారు. దీపాలు వెలిగించారు.. పటాకులు కాల్చారు.. ఆకాశంలోకి రాకెట్లు పంపారు.. బాంబుల మోత మోగించారు.. ప్రతి ఇంటి ఎదుట దీప కాంతులు వెల్లువెరిశాయి.. భారతదేశం మొత్తం ఒకే రోజు.. ఎంతో వేడుకగా జరిగిన ఈ దీపావళిని అంతరిక్షాన్ని తాకింది. 

భారతదేశంలోని దీపావళి వేడుకలను స్పేస్ స్టేషన్ లోని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు అద్భుతంగా చిత్రీకరించాయి. థాం ఆస్ట్రో అనే వ్యోమగామి.. వందల కిలోమీటర్ల ఎత్తు నుంచి భారతదేశంలోని దీపావళి వేడుకలను షూట్ చేశాడు. భూమిపై నక్షత్రాల మాదిరిగా.. దీపాల వెలిగిపోవటం ఈ వీడియోలో అద్బుతంగా కనిపించింది. దేశం మొత్తం దీపాలు వెలిగిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోనే సాక్ష్యం.

మొదటిసారిగా స్పేస్ స్టేషన్ నుంచి 2017లో ఇలాంటి వీడియోనే ఒకటి వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లు మరో వీడియో రావటం విశేషం. 2023, నవంబర్ 12వ తేదీ ఆదివార రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ఈ వీడియో తీసినట్లు వెల్లడించింది స్పేస్ స్టేషన్. ఆ సమయంలో భారతదేశం వ్యాప్తంగా పల్లె, పట్టణాలు దీపాలతో వెలిగిపోయింది.

ALSO READ :- అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం.. బిల్డింగ్ యజమాని కోసం గాలింపు