వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో ఎప్పుడూ ముందుండే అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా మరో టెస్ట్ కు సిద్ధమవుతోంది. తొమ్మిదేళ్ల తర్వాత తమ గడ్డపై నుంచి స్పేస్ క్రూడ్ ఫ్లయిట్ ను ప్రయోగించడానికి అమెరికా ఉరకలు వేస్తోంది. ఈనెల 27న ఇద్దరు యూఎస్ ఆస్ట్రోనాట్స్ ను స్పేస్ వెస్సెల్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు పంపడానికి నాసా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైనల్ వెరిఫికేషన్ కోసం యూఎస్ స్పేస్ ఏజెన్సీతోపాటు ఇయాన్ మాస్క్ కంపెనీలోని టాప్ అఫీషియల్స్ గురువారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ లో మీటింగ్ నిర్వహించారు.
We're counting down to the launch of Crew Dragon with two @NASA_Astronauts on board. This week:
? Participate at home in #LaunchAmerica
?? @VP Pence on human spaceflight's return to the U.S.
? Naming the @NASARoman ? for our 1st chief astronomerWatch: https://t.co/D1rrVz9bjF pic.twitter.com/nxTHsqB5OK
— NASA (@NASA) May 23, 2020
‘ఫ్లైట్ రెడీనెస్ రివ్యూ ముగిసింది. నాసా స్పేస్ ఎక్స్ క్య్రూ డ్రాగన్ మిషన్ లిఫ్టాఫ్ అవడానికి ప్రాసెస్ క్లియర్ అయింది’ అని యూఎస్ స్పేస్ ఏజెన్సీ ట్విట్టర్ లో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే బుధవారం కెన్నడీ లాంచ్ ప్యాడ్ నుంచి స్పేస్ ఫ్లయిట్ ప్రయాణం షురూ అవనుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) కు వెళ్లడానికి ఆస్ట్రోనాట్స్ రాబర్ట్ బెంకన్, డగ్లస్ హర్లే రెడీ అవుతున్నారు. ఈ మిషన్ సక్సెస్ అయితే ఐఎస్ఎస్ కు వెళ్లడానికి సూయజ్ లాంటి రాకెట్స్ కోసం రష్యాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని అమెరికా భావిస్తోంది. స్పేస్ ఎక్స్ మిషన్ కోసం అగ్రరాజ్యం కొన్ని బిలియన్ ల డాలర్లను వెచ్చించింది.