సముద్రం వేడెక్కుతోంది.. భయపెడుతున్న నాసా రిపోర్ట్..

సముద్రం వేడెక్కుతోంది.. భయపెడుతున్న నాసా రిపోర్ట్..

ఈ భూ ప్రపంచంలో తెలివైన ప్రాణి మనిషి. ఆదిమానవ కాలంలో జంతువులతో కలిసి బతికిన మనిషి, ఆ తర్వాత నాగరికత అలవరచుకొని,సహజ వనరులను వాడుకుంటూ విశ్వనాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు.ఒంటి మీద బట్ట కట్టుకోవడం కూడా తెలీని స్థాయి నుండి స్పేస్ సూట్ తొడుక్కొని చంద్రుడి మీదకి, అంగారక గ్రాహం మీదకి వెళ్లే స్థాయికి వచ్చాడు మనిషి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.ఈ భూమి మీదకు పేయింగ్ గెస్ట్ గా మాత్రమే వచ్చిన మనం మన ఇష్టం వచ్చినట్లు భూమిని వాడుకొని భూగోళాన్ని ఇబ్బంది పెడుతున్నాం. మన అవసరాల కోసం సహజవనరులను భవిష్యత్ తరాలకు అందుబాటులో లేకుండా చేస్తున్నాం. ఇటీవల నాసా రిలీజ్ చేసిన రిపోర్ట్ భయానక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాల్లోకి వెళితే, గత పదేళ్లలో సముద్ర భాగం వేడెక్కిందని, 1800 సంవత్సరం నుండి 2023 దాకా ఈ పదేళ్లలోనే వేడెక్కిందని నాసా రిపోర్ట్ లో వెల్లడైంది. దీని వల్ల తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని నాసా హెచ్చరించింది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల మంచు పర్వతాలు కరిగి భూమి మీద నీటి శాతం పెరిగి భూభాగం తగ్గిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. అంతే కాకుండా ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల మెరైన్ ఎకో సిస్టం దెబ్బ తింటుందని తెలిపింది.