చంద్రుడిపై రైళ్లు నడిపేందుకు నాసా భారీ ప్లాన్ చేస్తోంది. చంద్రుడిపై రైలు బండి కూతపెట్టే రోజు ఎంతో దూరంలో లేదని చెబుతోంది. చందమామ ఉపరితలం చుట్టూ రిలయబుల్, అటానమస్, ఎఫిషియంట్ పేలోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ అందించడానికి చంద్రునిపై పూర్తి స్థాయి మొదటి రైల్వే స్టేషన్‌ను నిర్మించాలని నాసా భావిస్తోంది. ఇది భూమిపై ఉండే రైల్వే స్టేషన్ల కంటే భిన్నంగా ఉంటుంది.
ఇప్పుడు నాసా ఇంతకు మించిన పెద్ద లక్ష్యాలపై కన్నేసింది. జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు జరిపాయి. ఇప్పటికే కొన్ని దేశాలు చంద్రుడిని చేరుకున్నాయి. ఒకప్పుడు చందమామ ఎప్పటికీ అందదు అనుకునేవారు. ఆకాశంలోకి చూస్తూ, ఎవరికి తోచిన ఊహలు వారు అల్లుకునేవారు. కానీ తర్వాతి కాలంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, అంతరిక్ష పరిశోధనల పుణ్యమా అని చంద్రునిపైకి వెళ్లడం సాధ్యమైంది. మన దేశం చంద్రయాన్ 3 ప్రయోగంతో చంద్రుడి గుట్టును మరింత తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికీ చాలా దేశాల అంతరిక్ష పరిశోధనల ప్రణాళికల్లో చంద్రుడి అన్వేషణ భాగంగా ఉంది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ఒక అడుగు ముందుకు వేసింది.
చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి రైళ్లు నడపాలని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏకంగా చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి, రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేస్తోంది. రైల్వేస్టేషన్ల ఏర్పాటుకు ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ టాక్ (ఫ్లోట్) అనే ప్రత్యేక వ్యవస్థను నాసా ప్రతిపాదించింది. ఇందుకోసం మాగ్నెటిక్ లెవిగేషన్ టెక్నాలజీని పరిచయం చేసింది. సాంప్రదాయక రైళ్ల మాదిరిగా కాకుండా చంద్రుడిపై ట్రైన్స్ తేలియాడుతూ ప్రయాణిస్తాయి.మూన్ మిషన్స్ పరంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ఒక అడుగు ముందుకు వేసింది.
నాసా ఇందుకు ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఎ ట్రాక్ (ఫ్లోట్) సిస్టమ్‌ను పరిచయం చేస్తోంది. ఇది ప్రత్యేకమైన 3-లేయర్ ఫ్లెక్సిబుల్ ఫిల్మ్ ట్రాక్‌లో మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ట్రెడిషినల్ లూనార్ రోబోట్స్ వీల్స్ లేదా ట్రాక్స్ చంద్రుడిపై ఎక్కువగా ఉండే దుమ్ము, ధూళిని గాల్లోకి లేపుతాయి. ఈ సమస్య లేకుండా ఫ్లోట్ రోబోట్స్ డయామాగ్నెటిక్ లెవిటేషన్ ఉపయోగించి, దుమ్ము రాపిడిని తగ్గించడం ద్వారా ఉపరితలంపై ఫ్లోట్ అవుతాయి. ఈ ఫ్లోట్ రోబోలకు కదిలే భాగాలు ఉండవు. ఫ్లెక్సిబుల్ ట్రాక్స్ నేరుగా లూనార్ రెగోలిత్ (ఉపరితల పదార్థం)పై ఏర్పాటు చేస్తారు. దీంతో రోడ్లు లేదా రైల్వేల వంటి సంక్లిష్టమైన ఆన్-సైట్ నిర్మాణం అవసరం ఉండదు.
సంప్రదాయ రైళ్ల వ్యవస్థలో సాధారణంగా తలెత్తే చక్రాలు, ట్రాకుల సవాళ్లను అధిగమించడంలో మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ ఉపయోగపడనుంది. ట్రాక్‌పై చంద్రుడి దుమ్ము ధూళి రాపిడిని తగ్గించడానికి ఫ్లోట్ రోబోలను ప్రత్యేకంగా ఇంజనీరింగ్ చేస్తారు. ట్రాక్‌ను రైలు తాకకుండా ఈ రోబోలు నిరోధిస్తాయి. తద్వారా రైలు సజావుగా తేలుతూ ప్రయాణిస్తుంది. మూన్ టూ మార్స్‌కి సంబంధించిన , రోబోటిక్ లూనార్ సర్ఫేస్ ఆపరేషన్స్ 2 (RLSO2) వంటి మిషన్ కాన్సెప్ట్‌లలో ఊహించినట్లుగానే ఉంటుంది. 2030 నాటికి స్థిరమైన లూనార్ బేస్ రోజువారీ కార్యకలాపాలకు మన్నికైన, దీర్ఘకాలం ఉండే రోబోటిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ కీలకం అవుతుందని నాసా పేర్కొంది.
ప్రతిపాదిత ఫ్లోట్ వ్యవస్థ సెకన్‌కు 0.5 మీటర్ల వేగంతో వివిధ ఆకృతుల పేలోడ్‌లను రవాణా చేయగలదని నాసా పేర్కొంది. ఒక భారీ స్థాయి ఫ్లోట్ వ్యవస్థ రోజుకు లక్ష కిలోల పేలోడ్‌ను చాలా కిలోమీటర్లకు పైగా దూరం తరలించగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. చంద్రుడిపై స్థావర కార్యకలాపాలను సులభతరం చేస్తుందని అంచనా వేసింది. చంద్రుడిపై ఈ నూతన రవాణా పరిష్కారం భూమికి వెలుపల మానవ అన్వేషణ, ఆవాసాల అభివృద్ధిలో గణనీయమైన ముందడుగు అని నాసా ఆశాభావం వ్యక్తం చేసింది.
నాసా, ఫ్టోట్ సిస్టమ్ సవాలుతో కూడిన చంద్రుడి వాతావరణంలో మినిమల్ ప్రిపరేషన్‌తో పనిచేస్తుంది. ఈ ట్రాక్ నెట్‌వర్క్‌ను లూనార్ బేసెస్‌లో మారుతున్న మిషన్ అవసరాలకు అనుగుణంగా రోల్ అప్ చేయవచ్చు, తిరిగి వెంటనే ఏర్పాటు చేయవచ్చు. డెవలప్‌మెంట్ ఫేజ్ 2లో, నాసా చిన్న తరహా రోబోట్, ట్రాక్ ప్రోటోటైప్‌లను డిజైన్ చేస్తుంది, తయారు చేస్తుంది, పరీక్షిస్తుంది. పర్యావరణ కారకాలు సిస్టమ్ పనితీరు, మన్నికను ఎలా ప్రభావితం చేస్తాయో అధ్యయనం చేయడానికి ఈ ప్రొటోటైప్స్ లూనార్-అనలాగ్ టెస్ట్ ఎన్విరాన్‌మెంట్స్‌లో ప్రయోగిస్తారు.