
NASA Updates: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకి వచ్చేందుకు అంతా సిద్ధంగా ఉంది. ఇందులోభాగంగా అమెరికన్ స్పేస్ సంస్థ నాసా తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ మార్చి 19 నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) నుంచి వీలైనంత త్వరగా బయలుదేరాల్సి ఉందని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అలాగే ట్రాన్స్‌పోర్టర్-13 మిషన్‌ను ప్రారంభించడానికి మార్చి 14 సాయంత్రం 7:03 గంటల కంటే ముందే స్పేస్‌ఎక్స్ క్రూ-10 లక్ష్యాన్ని చేరుకుంటుందని నాసా తెలిపింది.
అయితే మర్చి 14(గురువారం) కంటే ముందుగా జరగాల్సిన ఈ మిషన్ విమాన మార్గంలో పలు అవాంతరాలు ఉండడం వంటి కారణంగా ఆలస్యం అయ్యింది. దీంతో ఫ్లోరిడాలోని NASA కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A వద్ద ఫాల్కన్ 9 రాకెట్ కోసం గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్‌తో హైడ్రాలిక్ సిస్టమ్ సమస్యను పరిష్కరించడానికి పలువురు సైంటిస్టుల బృందాలు పనిచేస్తున్నాయి.
మార్చి 14న క్రూ-10 ప్రయోగంతో నాసా వ్యోమగాములు నిక్ హేగ్, సుని విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్‌లతో కూడిన క్రూ-9 మిషన్, రోస్కోస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌తో కలిసి, మార్చి 19 బుధవారం కంటే ముందుగానే అంతరిక్ష కేంద్రం నుండి బయలుదేరుతుంది. నాసా ఆస్ట్రోనాట్లు అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, జాక్సా (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ) వ్యోమగామి టకుయా ఒనిషి, రోస్కోస్మోస్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీలోని ఆస్ట్రోనాట్ క్రూ క్వార్టర్స్‌లో ఉంటారు. ఫాల్కన్ 9 వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్‌లోని ల్యాండింగ్ జోన్ 4 (LZ-4)లో ల్యాండ్ అవుతుంది.