- తొలిసారి మహిళను ఎంపిక చేసిన నాసా
వాషింగ్టన్: చంద్ర మండలానికి తాము పంపే మానవ సహిత అంతరిక్ష ప్రయోగం కార్యక్రమానికి హెడ్ గా ఓ మహిళను నాసా ఎంపిక చేసింది. 2024లో చంద్రుడిపైకి మానవ సహిత లాంచ్ ప్రయోగాలకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్న నాసా.. హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్స్ అండ్ ఆపరేషన్స్ డైరెక్టరేట్‌కి హెడ్‌గా కేథీ లూడర్స్ ని ఎంపిక చేశామని నాసా చీఫ్ జిమ్ బ్రిడెన్ స్టెయిన్ ట్విట్టర్ లో ప్రకటించారు. 2024లో తాము చేపట్టబోయే ప్రయోగాన్ని నిర్వహించేందుకు కేథీ సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. 1992 లో నాసాలో చేరిన కేథీ లూడర్స్ తన కేరీర్ లో కమర్షియల్ క్రూ, కమర్షియల్ కార్గో ప్రోగ్రామ్‌లను సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. కిందటి నెల 30 న ఆమెరికాలోని ఫ్లోరిడా స్టేషన్ నుంచి స్పెస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఇద్దరు ఆస్ట్రొనాట్స్ ని స్పేస్ స్టేషన్ కు పంపిన ప్రయోగాన్ని కేథీ పర్యవేక్షించారు.
#ICYMI: @Commercial_Crew Program Manager Kathy Lueders has been selected to be the agency’s next associate administrator of human spaceflight programs. ?
The appointment takes effect following our successful #LaunchAmerica mission to the @Space_Station: https://t.co/skJj2DlSt3 pic.twitter.com/2NAjmCVfds
— NASA (@NASA) June 12, 2020