చంద్రునిపై మానవ నివాసానికి యోగ్యమైన ప్రాంతాలను అన్వేషిస్తున్న సమయంలో సైంటిస్టులకు పెద్ద గొయ్యి కనిపించింది. నాసా విభగమైన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (LRO) మూన్ పై కనుగొన్న గుహ ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ గుహ లోతు 200 మీటర్లు ఉంది. ఇది అపోలో 11 ల్యాండింగ్ సైట్ కు ఈశాన్యానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ALSO READ | భూమిపైన ఉన్నట్లుగానే చంద్రుడిపైన కూడా శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ
అంతర్జాతీయ శాస్త్రవేత్తల టీం 2010లో ప్రవేశపెట్టిన LROలోని మినీ RF పరికరం ద్వారా సేకరించిన రాడార్ డేటాను విశ్లేషిస్తూ, మేరే ట్రాంక్విల్లిటాటిస్‌లో ఓ గుహ ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ గొయ్యి అపోలో 11 ల్యాండింగ్ సైట్‌కు ఈశాన్యంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మంచుకొండ అంచు కావచ్చని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నాసా మొదటి సారి గుహ ఫొటోలను ఎక్స్ లో షేర్ చేసింది.
Have you heard the news about caves on the Moon?
— NASA (@NASA) July 18, 2024
Re-analyzed data from our Lunar Reconnaissance Orbiter found evidence for a cave extending hundreds of feet from a lunar pit—and it may not be the only one: https://t.co/jqkhQbXflf pic.twitter.com/FqGpQ43jmc