- సేఫ్ గా దిగి ఫొటో పంపింది!
- మార్స్ పై సక్సెస్ ఫుల్‌గా దిగిన నాసా రోవర్ ‘పర్సివరెన్స్’
- ల్యాండింగ్‌ను కన్ఫామ్ చేసిన నాసా లీడ్ ఇంజనీర్ డాక్టర్ స్వాతి మోహన్ ః
- మార్స్ పైకి చేరిన నాసా 5వ రోవర్‌గా ‘పర్సివరెన్స్’
వాషింగ్టన్: భూమి నుంచి ఇరవై కోట్ల కిలోమీటర్ల దూరం.. ఇక్కడి నుంచి సిగ్నల్స్ పంపినా అక్కడికి 3 నుంచి 20 నిమిషాల మధ్య ఎప్పుడు చేరతాయో కూడా తెల్వదు. ఇక అక్కడ అట్మాస్పియర్ ఎప్పుడు ఎట్లుంటదో.. అసలే అర్థంకాదు. అట్లాంటి మార్స్ (అంగారక గ్రహం)పై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరో రోవర్ ను సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ చేసింది. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ‘పర్సివరెన్స్’ రోవర్ మార్స్ పై సేఫ్ గా దింపినట్లు మిషన్ ఫ్లైట్ కంట్రోలర్, ఇండియన్ అమెరికన్ నాసా ఇంజనీర్ డాక్టర్ స్వాతి మోహన్ ప్రకటించారు. ‘‘పర్సివరెన్స్ సేఫ్ గా మార్స్ నేలపై దిగినట్లు కన్ఫామ్ అయింది. మార్స్ పై ఒకప్పుడు జీవం ఉండేదా? అన్నది తేల్చేందుకు సిద్ధం అవుతోంది” అని ఆమె వెల్లడించారు. మార్స్ పై దిగిన వెంటనే పర్సివరెన్స్ అక్కడి నేలను ఫొటో తీసి పంపినట్లు ఆమె ప్రకటించారు. పర్సివరెన్స్ మిషన్ లో స్వాతి మోహన్ మొదటి నుంచీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మిషన్ ను లాంచ్ చేశాక కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ అంశాలపై లీడ్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. గతంలో నాసా శాటర్న్, మూన్ మిషన్ లలో కూడా ఆమె పనిచేశారు.
7 నిమిషాల టెర్రర్ కు తెర
మార్స్ అట్మాస్పియర్ లోకి ఎంటరై, నేలపై సేఫ్ గా ల్యాండ్ అయ్యే క్రమంలో చివరి ఏడు నిమిషాలు చాలా కీలకం కావడంతో ఈ టైంను నాసా ‘సెవెన్ మినిట్స్ ఆఫ్ టెర్రర్’గా పిలిచింది. ఈ టైంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కోట్ల డాలర్ల మిషన్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే ఒక కారు అంత సైజు, వెయ్యి కిలోల బరువు ఉన్న పెర్సీవిరెన్స్ రోవర్ పారాచూట్ సాయంతో మార్స్ అట్మాస్పియర్ లో సేఫ్ గా కిందికి దిగింది. గంటకు 20 వేల కిలోమీటర్ల స్పీడుతో రోవర్ కిందకు దిగినా.. అది మండిపోకుండా హీట్ షీల్డ్ కాపాడింది. చివరగా హెలికాప్టర్ లాంటి స్కైక్రేన్ కూడా బాగా పనిచేసింది. రోవర్ ను నెమ్మదిగా నేలపై దింపి దూరంగా ఎగిరిపోయింది. పర్సివరెన్స్ ల్యాండింగ్ సక్సెస్ ఫుల్ కావడంతో నాసా సైంటిస్టులంతా ఊపిరి పీల్చుకున్నారు. పర్సివరెన్స్ ల్యాండింగ్ లో ‘ఇన్ జెన్యుటీ’ అనే హెలికాప్టర్ వంటి స్కై క్రేన్ కీలక పాత్ర పోషించింది. మార్స్ పై స్కై క్రేన్ ను ఉపయోగించడం ఇదే తొలిసారి. ఫ్యూచర్ లో రోవర్–డ్రోన్ మిషన్ లకు ఇది ఒక మోడల్ గా నిలువనుంది.
For More News..