వాషింగ్టన్ : భారతీయ వ్యోమగాములకు నాసా శిక్షణ ఇవ్వనుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వ్యోమగాములను పంపే ఉద్దేశంతో ఈ శిక్షణ ఉండనున్నట్లు భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి తెలిపారు. ఏడాది తర్వాత భారతీయ వ్యోమగాములకు నాసా అడ్వాన్స్డ్ శిక్షణ ఉంటుందని ఆయన వెల్లడించారు.
అమెరికా, ఇండియా మధ్య కమర్షియల్ స్పేస్ కాన్ఫరెన్స్ అన్న అంశంపై బెంగుళూరులో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా, భారత్ బిజినెస్ కౌన్సిల్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఈ త్వరలోనే సతీష్ ధావన్ సెంటర్ నుంచి నిసార్ శాటిలైట్‌ను ప్రయోగించనున్నట్లు గార్సెటి తెలిపారు.