అస్టారాయిడ్ 2024 JY1తో భూమికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది నాసా. ఈ అస్టారాయిడ్ గంటకు 37వేల 70 కిలో మీటర్ల వేగంతో భూమి వైపు దూసుకోస్తోందని చెప్పారు నాసా సైంటిస్టులు. ఇది 160 ఫీట్లతో ఒక విమానం సైజులో ఉందని వివరించారు. ఐతే ఇప్పటికిప్పుడు... ప్రమాదమైతే లేదన్నారు సైంటిస్టులు. ప్రస్తుతం భూమికి 4 మిలియన్ మైళ్ల దూరంలో ఉందన్నారు. అంటే..ఇక్కడి నుంచి చంద్రుని కంటే 17 రెట్లు ఎక్కువ అని చెప్పారు శాస్త్రవేత్తలు.
ప్రస్తుతం దిశలు మారూస్తూ...భూమి వైపే అతివేగంగా దూసుకొస్తోందన్నారు సైంటిస్టులు. ఇది ఎప్పుడు ఎక్కడ కూలుతోందో... ఇప్పుడే కరెక్టుగా ఏమీ చెప్పలేమన్నారు. ఒకవేళ సముంద్రంలో కాకుండా భూమిపైనే పడే పరిస్థితి వస్తే...దానిని ఇతర పరికరాలతో సముద్రంలో కూల్చే మార్గాలపై పరిశోధనలు చేస్తున్నామన్నారు సైంటిస్టులు.