మరో 150 యేళ్లలో భూమి అంతం కాబోతోందా?.. అంతరిక్షం నుంచి గ్రహశకలం (ఆస్ట్రరాయిడ్) భూమిని ఢీకొట్టి భారీ విధ్వంసం సృష్టించనుందా..? బిన్ను అనే గ్రహ శకలం (ఆస్ట్రరాయిడ్) 2182లో భూమిని ఢీకొట్ట నుందా..? ఏడేళ్ల క్రితమే ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గుర్తించిందా?.. తాజాగా బెన్నూ గ్రహ శకలంపై నాసా శాస్త్రవేత్తల పరిశోధనలు సంచలన విషయాలను వెల్లడించాయి.
ఇటీవల నాసా శాస్త్రవేత్తలు ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. 159 ఏళ్లలో బెన్ను అనే గ్రహశకలం భూకొంటుందని.. నిరోధించేందుకు మేం చేపట్టిన చర్యలు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. వీరు చెప్పిన దాని ప్రకారం.. బెన్ను గ్రహ శకలం.. 2182 సెప్టెంబర్ 24న భూమిని ఢీకొట్టవచ్చు. ఈ విపత్తు సంఘటనకు 2,700లో 1 శాతం ఉన్నప్పటికీ.. అంత తేలిగ్గా తీసుకోకూడదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతలా అంటే.. విపత్తు నివారణకు సహాయపడే డేటాను సేకరించేందుకు నాసా ఏడేళ్ల క్రితమే అంతరిక్ష నౌకను ప్రయోగించింది.
NASA ప్రకారం.. బెన్ను గ్రహశకలం 1999లో గుర్తించబడింది. ప్రతి ఆరేళ్లకు ఒకసారి భూమికి అతి సమీపంలోకి వస్తుంది. స్పేస్ రాక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పరిమాణంలో ఉంటుందని.. 22 అణుబాంబుల శక్తిని కలిగి ఉంటుందని అంచనా వేశారు నాసా శాస్త్రవేత్తలు.
అయితే బెన్ను గ్రహశకలంపై పరిశోధనలకు నాసా OSIRIS రెక్స్ అంతరిక్ష నౌకను 2020లో బెన్ను ఉల్క ఉపరితలంపైకి పంపింది. నైటింగేల్ అనే ప్రదేశంనుంచి రాతిని సేకరించారు.
బెన్ను సౌర వ్యవస్థలో అతి పురాతన అవశేషం. శాస్ర్తవేత్తల ప్రకారం.. 4.5 బిలియన్ సంవత్సరాల పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని మొదట RQ36 గా పిలిచారు. మైఖేల్ పుజియో అనే మూడవ తరగతి పిల్లవాడు ఆస్టరాయిడ్ కు పేరు పెట్టే పోటీలో గెలిచిన తర్వాత, 2013లో దీనికి బెన్ను అని పేరు పెట్టారు.
ఏడేళ్లుగా బెన్నుపై చేస్తున్న పరిశోధనలు చివరి దశలో ఉన్నాయి. సుదీర్ఘ పరిశోధన తర్వాత భూమిని ఢీకొట్టే విపత్తును నివారించేందుకు చేస్తున్న పరిశోధనలు ఆనందాన్నిస్తున్నాయని OSIRIS-REx ప్రాజెక్ట్ మేనేజర్ రిచ్ బర్న్స్ ఓ ప్రకటనలో తెలిపారు. OSIRIS-REx మిషన్ గ్రహశకలం నమూనాలు వచ్చే వారం భూమిపైకి చేరుకుంటాయి అన్నారు రిచ్ బర్న్స్.
OSIRIS-REx మిషన్ అన్వేషణలు ప్రపంచాన్ని విపత్తు తాకిడి నుండి రక్షించడమే కాకుండా భూమిపై జీవం మూలాల గురించి సమాచారాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. ఈ మిషన్ 1998 బ్రూస్ విల్లీస్ చిత్రం ఆర్మగెడాన్‌ను గుర్తు చేస్తుంది.. ఈ చిత్రంలో విల్లీస్ టెక్సాస్ పరిమాణంలో ఉన్న ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టకుండా నిరోధించినట్లు.. గ్రహశకలం పై దిగడం ద్వారా దాని శక్తిని తగ్గించినట్లు ఈ చిత్రం చూపించారు. సరిగ్గా అలాంటిదే జరిగే అవకాశం ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.