అంగారకుడిపై ఆక్సిజన్ తయారు చేసిన నాసా..

అంగారకుడిపై ఆక్సిజన్ తయారు చేసిన నాసా..

అమెరికా స్పేస్ ఏజెన్సీ NASA అంగారకుడిపై పట్టు సాధించింది. రెడ్ ప్లానెట్ లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్రయోగాన్ని రోవర్ తో కలిసి విజయవంతంగా పూర్తి చేసింది. రెడ్ ప్లానెట్ లో ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది ప్రకటించింది. మసాచు సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) అభివృద్ధి చేసిన MOXIE (మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్) అని పిలవబడే Perseverance రోవర్.. రెడ్ ప్లానెట్ మీద విజయవంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసిందని నాసా తన బ్లాగ్ లో పోస్ట్ చేసింది. 

టెక్ డెమో మార్టిన్ CO2 ను ఆక్సిజన్‌గా మార్చడాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఇది భవిష్యత్తులో అంగారక గ్రహానికి మానవ మిషన్‌లకు మార్గం సుగమం చేస్తుందని నాసా ప్రకటించింది. 2021లో  MOXIE ల్యాండింగ్ అయినప్పటి నుంచి రోవర్‌లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇది మొత్తం 122 గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా అంచనాలను మించిపోయింది. ఉత్పత్తి చేయబడిన ఆక్సిజన్ 98శాతం స్వచ్ఛత లేదా మెరుగ్గా ఉంటుంది, ఇది ఇంధనం, శ్వాస ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని నాసా తెలిపింది. 

ALSO READ :మంత్రి నెత్తిన పసుపు పోసిన వ్యక్తి.. స్పాట్ లో చితక్కొట్టారు

"MOXIE అద్భుతమైన పనితీరు మార్స్ వాతావరణం నుంచి ఆక్సిజన్‌ను వెలికితీసే సాధ్యాసాధ్యాలను ప్రదర్శిస్తుంది-. భవిష్యత్ వ్యోమగాములకు శ్వాసక్రియ గాలి లేదా రాకెట్ ప్రొపెల్లెంట్‌ను సరఫరా చేయడానికి ఇది ఉపయోగపడుతుందని NASA డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ మెల్రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.