- యూఎస్ టెక్ కంపెనీలకు.. చైనా డీప్‌సీక్ షాక్
న్యూఢిల్లీ: యూఎస్, జపనీస్ టెక్ కంపెనీల కు పోటీగా చైనీస్ స్టార్టప్ కంపెనీ డీప్‌సీక్ ఓ కొత్త ఏఐ మోడల్‌ను లాంచ్ చేసింది. ఫలితంగా అమెరికా, జపాన్ మార్కెట్‌లు సోమవారం భారీగా పడ్డాయి. ఎన్విడియా షేర్లు 17 శాతం పడగా, గూగుల్ 3 శాతం నష్టపోయింది.
యూఎస్ కంపెనీల ఆధిపత్యానికి బ్రేక్ పడుతుందని యూఎస్ సిలికాన్ వ్యాలీ భావిస్తోంది. డీప్‌సీక్ కేవలం 5.6 మిలియన్ డాలర్లకే ఏఐ మోడల్ జనస్ ప్రో 7బీ ని డెవలప్ చేసింది. ఇది ఓపెన్ ఏఐ మోడల్ డాల్–ఈ3 కంటే మెరుగ్గా ఉంది.
అంతే కాకుండా డీప్‌సీక్ ఏఐ మోడల్‌లో చౌకైన చిప్‌లను వాడడానికి వీలుందని ఫోర్బ్స్ రిపోర్ట్ చేసింది. యూఎస్ ఏఐ కంపెనీలకు భిన్నంగా ఇది ఓపెన్ సోర్స్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుందని తెలిపింది.
దీంతో హైఎండ్ హార్డ్‌వేర్ ఎగుమతులను యూఎస్ ఆపేసినా, ఇతర దేశాలకు ఆల్టర్నేటివ్ దొరుకుతుంది. యూఎస్ నాస్‌డాక్ 3 శాతానికిపైగా పడింది. మరోవైపు హాంకాంగ్, షాంఘై మార్కెట్‌లు సోమవారం లాభాల్లో కదిలాయి.