
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ఒక స్కూల్లో విద్యార్థుల స్కూల్ బ్యాగులను తనిఖీ చేయగా కండోమ్స్, కత్తులు కనిపించాయి. ఏడవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థుల స్కూల్ బ్యాగ్స్లో కండోమ్ ప్యాకెట్లు, కత్తులు, ప్లేయింగ్ కార్డ్స్ కనిపించడంతో స్కూల్ యాజమాన్యం విస్తుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సదరు స్కూల్ వైస్ ప్రిన్సిపాల్.. విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయాలని సిబ్బందికి చెప్పారు. స్కూల్ సిబ్బంది తనిఖీ చేయగా ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు విద్యార్థుల్లో క్రిమినల్ మనస్తత్వం పెరగడం ఆందోళన కలిగించిందని, ఇకపై ప్రతీ రోజు పిల్లల స్కూల్ బ్యాగ్స్ చెక్ చేస్తామని వైస్ ప్రిన్సిపాల్ చెప్పుకొచ్చారు.
#WATCH | Nashik: Condoms, Knives Found In Backpacks Of Class 5 & 6 Students In School In Ghoti
— Free Press Journal (@fpjindia) April 8, 2025
Read story by Prashant Nikale: https://t.co/28s8VaA4dz #Maharashtra #NashikNews pic.twitter.com/xafvcIN8Lu
నాసిక్ జిల్లాలోని ఘోటిలో ఉన్న ఒక స్కూల్లో ఈ ఉదంతం వెలుగుచూసింది. ఇవి మాత్రమే కాదు.. కొందరు విద్యార్థుల బ్యాగుల్లో డ్రగ్స్ కూడా దొరకడంతో స్కూల్ యాజమాన్యానికి ఫ్యూజులు ఎగిరిపోయినంత పనైంది. ఇది.. కేవలం తనిఖీలతో చేతులు దులుపుకునే విషయం కాదని పోలీసులకు స్కూల్ మేనేజ్ మెంట్ రిపోర్ట్ చేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.