ఎమ్మెల్యే నిర్లక్షానికి నస్కల్ రోడ్డు నిదర్శనం

మెదక్ (నిజాంపేట), వెలుగు : నిజాంపేట మండల కేంద్రం నుంచి మేజర్ గ్రామ పంచాయతీ నస్కల్ కు వెళ్లే మెయిన్​ రోడ్డును సోమవారం పీసీసీ అధికార ప్రతినిధి బాలకృష్ణ, మెంబర్​ సుప్రభాత్​ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నస్కల్ రోడ్డు దుస్థితికి, ప్రజలు ఇబ్బందులు పడటానికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు.

ఈ రోడ్డు పరిస్థితి   మూడు సంవత్సరాల క్రితం లాగే  ఉన్నదన్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్ రెడ్డి, హఫీజ్, స్వామి, వెంకటేశ్, సిద్ధరాములు పాల్గొన్నారు.