కాకా క్రికెట్ టోర్నీ: నస్పూర్, హాజీపూర్ టీమ్స్ గెలుపు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్​ స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక మంచిర్యాల నియోజకవర్గ స్థాయి క్రికెట్​పోటీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్​లలో నస్పూర్​సూపర్​కింగ్స్, హాజీపూర్ టైగర్స్ టీమ్స్​విజయం సాధించాయి. మొదటి మ్యాచ్​లో లక్సెట్టిపేట హీరోస్, నస్పూర్ ​సూపర్ ​కింగ్స్​ తలపడగా, మొదట బ్యాటింగ్ ​చేసిన లక్సెట్టిపేట టీమ్​16 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 115 రన్స్ చేసింది. జట్టులోని ప్రకాశ్, రమేశ్​చెరో 35 రన్స్​చేశారు.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన నస్పూర్​సూపర్​కింగ్స్ బ్యాటర్లు 13.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్​ను చేజ్​చేశారు. నస్పూర్​ప్లేయర్​వినోద్​4 ఓవర్లు వేసి 4 కీలక వికెట్లు తీసి ప్లేయర్​ఆఫ్ ది మ్యాచ్​దక్కించుకున్నాడు. రెండో మ్యాచ్​లో హాజీపూర్​టైగర్స్, దండేపల్లి లయన్స్​తలపడగా, మొదట బ్యాటింగ్​చేసిన హాజీపూర్​టీమ్​18 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 148 రన్స్​చేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన దండెపల్లి లయన్స్ టీమ్ 18 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి  కేవలం 90 రన్స్​మాత్రమే చేసింది. హాజీపూర్​ప్లేయర్​సాత్విక్ పటేల్​41 రన్స్ చేయడంతోపాటు రెండు వికెట్లు తీసి ప్లేయర్​ఆఫ్​ది మ్యాచ్​అందుకున్నాడు.