నస్పూర్, మంచిర్యాల రాయల్స్ విజయం

కోల్​బెల్ట్, వెలుగు :  మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​సింగరేణి ఠాగూర్​స్టేడియంలో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి స్మారక మంచిర్యాల నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం జరిగిన మ్యాచ్​లో మంచిర్యాల రాయల్స్, దండెపల్లి లయన్స్​జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్​చేసిన దండేపల్లి లయన్స్ టీమ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 116 రన్స్ చేసింది. మంచిర్యాల రాయల్స్​బ్యాటర్లు11.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్​ను చేజ్​చేశారు. 

మంచిర్యాల రాయల్స్​టీమ్​కు చెందిన సాయిరెడ్డి 17 రన్స్​చేయడంతోపాటు రెండు వికెట్లు తీసి ‘ప్లేయర్​ఆఫ్​ ది మ్యాచ్’ కైవసం చేసుకున్నాడు. మధ్యాహ్నం నస్పూర్, హాజీపూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​హోరాహోరీగా సాగింది. మొదట బ్యాటింగ్​చేసిన హాజీపూర్ టీమ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 144 రన్స్ చేసింది. శశికాంత్​ 47 బాల్స్​లో 6 ఫోర్లు, సిక్స్​తో 52 రన్స్​చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నస్పూర్ బ్యాటర్లు చేజింగ్​కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 145 రన్స్​చేసి విజయం సాధించారు. కౌశిక్ 53 బాల్స్​లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 62 రన్స్​చేసి ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​సాధించాడు.