రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నస్పూర్ విద్యార్థులు

నస్పూర్, వెలుగు: అథ్లెటిక్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన నస్పూర్ మున్సిపాలిటీ పరిధి సీతారాంపల్లి జిల్లా పరిషత్ 8వ తరగతి విద్యార్థులు రాము, రుచిత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 22న నస్పూర్ సాధన స్కూల్ గ్రాండ్ లో నిర్వహించిన పోటీల్లో ఈ ఇద్దరు 400మీటర్ల రన్నింగ్​లో ప్రతిభ చూపారు. దీంతో ఈ నెల 25న హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు స్కూల్ హెచ్​ఎం పద్మజ తెలిపారు. 

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు..

ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణంలో సెయింట్ మేరీ హైస్కూల్ 9వ తరగతి స్టూడెంట్​ మసాదే శివకృష్ణ ఎస్ జీఎఫ్  రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ మేరీ కేవి తెలిపారు. ఈ నెల 26 నుంచి 29 వరకు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగే పోటీల్లో పాల్గొంటాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివకృష్ణను డీఈఓ పార్శి అశోక్, ఆసిఫాబాద్ జిల్లా  ఎస్ జీ ఎఫ్ సెక్రెటరీ పి.సాంబశివరావు తదితరులు అభినందించారు.