తెల్లపులిని దత్తత తీసుకున్న స్కూల్​ స్టూడెంట్లు

తెల్లపులిని దత్తత తీసుకున్న స్కూల్​ స్టూడెంట్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గచ్చిబౌలిలోని ఎన్ఏఎస్ఆర్ బాయ్స్ స్కూల్ స్టూడెంట్లు జూపార్కులో  రెండేండ్ల వయసున్న తెల్లపులి(ఉత్సవ్)ని ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. 

శుక్రవారం ఎన్ఏఎస్ఆర్ బాయ్స్ స్కూల్ సీఈఓ, ప్రిన్సిపాల్ మీర్ హఫీజుద్దీన్ అహ్మద్, ఎన్ఏఎస్ఆర్ గర్ల్స్‌‌‌‌ స్కూల్ ప్రిన్సిపాల్ మోహియుద్దీన్ మహమ్మద్, ఎన్ఏఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ మీర్ జమాలుద్దీన్ అహ్మద్ జూపార్క్ డైరెక్టర్ సునీల్ హిరేమఠ్​, క్యూరేటర్ జె.వసంతకు రూ.3 లక్షల చెక్కు అందజేశారు. మీర్ హఫీజుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ 2004 నుంచి తమ స్కూల్ పులులను దత్తత తీసుకుంటుందన్నారు.