Champions Trophy 2025: పాకిస్థాన్‌కు కాదు టీమిండియాకే అనుకూలంగా టోర్నీ: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు

Champions Trophy 2025: పాకిస్థాన్‌కు కాదు టీమిండియాకే అనుకూలంగా టోర్నీ: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు

ఛాంపియన్స్ ట్రోఫీ సొంతగడ్డపై జరగనుండడంతో పాకిస్థాన్ కు ఈ మెగా టోర్నీకి అనుకూలంగా మారుతుందని అనుకున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు నాజర్ హుస్సేన్, మైఖేల్ అథర్టన్ ఖండించారు. ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కు అనుకూలంగా మారిందని వారు చెప్పారు. అందుకు తగ్గ కారణం చెప్పి వివరించారు. 

అథర్టన్ స్కై క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. " ఇండియా ఒకే వేదికపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుంది. ఇతర జట్లు మాత్రం వేదికలు మారాల్సి వస్తుంది. పైగా వీరు వేరే దేశాలు ప్రయాణించాల్సి ఉంది. కానీ టీమిండియాకు ఆ అవసరం లేదు. వారు ఒకే వేదికపై అన్ని మ్యాచ్ లు ఆడుతూ పరిస్థితులను అలవాటు చేసుకోవచ్చు. ఎలాంటి ఒత్తిడికి గురియు కాకుండా ప్రశాంతంగా ఆడుకోవచ్చు". అని అన్నాడు. 

"సెమీస్, ఫైనల్ కు వస్తే మ్యాచ్ లు ఎక్కడ ఆడాలో భారత్ కు బాగా తెలుసు. అప్పటిలోగా దుబాయ్‌లోని పరిస్థితులకు అలవాటు పడతారు. అన్ని జట్లతో పోలిస్తే ఈ విషయం భారత జట్టుకు కలిసొస్తుంది. పాకిస్థాన్ ఆతిధ్యమిచ్చినా ఈ టోర్నీని భారత్ అనుకూలంగా మార్చుకుంది". అని హుస్సేన్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. 

Also Read :  భద్రత విషయంలో నిర్లక్ష్యం.. 100 మంది పోలీసులు సర్వీస్ నుంచి తొలగింపు

ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ఈవెంట్ లో భారత్ తమ అన్ని మ్యాచ్ లు దుబాయ్ లోనే ఆడాల్సి ఉంది. ఒకవేళ ఇండియా ఫైనల్ కు అర్హత సాధిస్తే దుబాయ్ లోనే ఫైనల్ ఆడాల్సి ఉంది. ఒకేవేళ టీమిండియా ఫైనల్ కు రాకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లాహోర్ లో నిర్వహిస్తారు. భధ్రత కారణాల వలన పాకిస్థాన్ లో పర్యటించడానికి భారత క్రికెట్ జట్టు నిరాకరించింది. దీంతో హైబ్రిడ్ మోడల్ ప్రకారం భారత్ తమ మ్యాచ్ లన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడుతుంది.