క్రికెట్ లో ప్రతి జనరేషన్ లో కొంతమంది ప్లేయర్లు తమదైన మార్క్ వేస్తారు. ఫార్మాట్ ఏదైనా నిలకడగా ఆడుతూ అలవోకగా పరుగులు రాబడతారు. ఈ తరంలో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్,జో రూట్ ఈ లిస్ట్ లో ఉన్నారు. ప్రస్తుత క్రికెట్ లో ఫ్యాబ్ 4 గా పరిగణిస్తారు. దశాబ్ద కాలంగా ఈ నలుగురు క్రికెట్ లో పోటీపడి మరీ పరుగులు చేశారు. అన్ని ఫార్మాట్ లో తగ్గేదే లేదన్నట్టు అదరగొట్టారు. అయితే, ప్రస్తుతం వీరు క్రికెట్ లో పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్నారు. ఫామ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నా.. స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించడం లేదు.
ఫ్యాబ్ 4 గా పరిగణించే ఈ నలుగురు మూడు ఫార్మాట్ లు ఆడడం లేదు. వీరి రిటైర్మెంట్ సమయం దగ్గర పడుతుంది. దీంతో ఇప్పుడు భవిష్యత్ లో ఫ్యాబ్ 4 అనే దానిపై చర్చ జరుగుతుంది. ఈ విషయంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ తన ఫ్యాబ్ 4 ను ప్రకటించాడు. అతని లిస్ట్ లో టీమిండియా యువ సంచలనం గిల్ లేకపోవడం విశేషం. ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్, ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, పాకిస్థాన్ యువ సంచలనం సైమ్ అయూబ్, టీమిండియా ఓపెనర్ జైశ్వాల్ ను స్కై స్పోర్ట్స్ పోడ్‌కాస్ట్‌లో ఫ్యూచర్ ఫ్యాబ్ 4 గా హుస్సేన్ ఎంపిక చేశాడు.
Also Read :- షమీకి నో ఛాన్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
బ్రూక్ 2024లో టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ తరపున 1000కి పైగా పరుగులు చేశాడు. ఇందులో పాకిస్థాపై ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఇటీవలే ఇంగ్లాండ్ వైట్ బాల్ ఫార్మాట్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. పాకిస్థాన్ ఓపెనర్ సైమ్ అయూబ్ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా ఆడుతూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డపై సెంచరీలు బాదాడు. ఇటీవలే వన్డే జట్టులో చోటు దక్కించుకున్న జైశ్వాల్.. టెస్ట్, టీ20 ఫార్మాట్ లో అదరగొడుతున్నాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాకు మూడు ఫార్మాట్ లలో కీలక ప్లేయర్ గా మారాడు.