ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో ఒక ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. బెనోనిలోని విల్లోమూర్ పార్క్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 19 ఓవర్ లో నాట్ స్కివర్-బ్రంట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు వెనకాల ఉన్న ఆమె టవల్ జారింది. అదే సమయంలో బౌలింగ్ వేయడానికి చేయి తిప్పిన తర్వాత ఆ టవల్ కాలికి తగిలి పైకి ఎగిరింది. బాల్ రిలీజ్ అయ్యే సమయానికి ఆ టవల్ కాస్త బంతికి అడ్డం వచ్చింది. దీంతో ఈ బాల్ ను డెడ్ బాల్ గా ప్రకటించారు.
ALSO READ | వరల్డ్ చాంపియన్‌షిప్స్‌కు మీరాబాయి దూరం
క్రికెట్ లో ఎప్పుడూ జరగని ఇలాంటి సీన్ నవ్వు తెప్పిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. డాని వ్యాట్-హాడ్జ్(78),నాట్ స్కివర్-బ్రంట్(67) హాఫ్ సెంచరీలతో రాణించారు. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 6 వికెట్లను 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. సారా గ్లెన్ నాలుగు వికెట్లతో ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
what a top bowler! 🔥 🔥 🔥
— Nikhil 🏏 (@CricCrazyNIKS) November 28, 2024
Nat Sync-Sciver Brunt!#SAvENG pic.twitter.com/s3ZJ0iopIS