
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) 2024 నోటిఫికేషన్‌ను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విడుదల చేసింది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో జవహరల్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పొందవచ్చు.
విద్యార్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతోపాటు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు, ప్రస్తుతం పరీక్షలు రాసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా 50 శాతం మార్కులతో డిప్లొమా పూర్తిచేసినవారూ, ఆఖరు సంవత్సరం విద్యార్థులు అర్హులే.
ఎగ్జామ్ ప్యాటర్న్: నాటాను మూడు సార్లు నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్నవారు మూడు పరీక్షలూ రాసుకోవచ్చు. రెండుసార్లు పరీక్ష రాస్తే ఎక్కువ మార్కులు సాధించిన ప్రయత్నాన్ని తుది స్కోరుగా పరిగణనలోకి తీసుకుంటారు. మూడుసార్లు రాస్తే ఎక్కువ మార్కులు పొందిన రెండు పరీక్షల సగటును మలి స్కోరుగా నమోదు చేస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించడానికి 70 మార్కులు పొందాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం అవుతాయి. పరీక్ష ఏప్రిల్ 6 నుంచి ప్రారంభం అవుతాయి. పూర్తి వివరాలకు www.nata.in వెబ్సైట్లో సంప్రదించాలి.