టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అతని భార్య నటాసా స్టాంకోవిచ్ విడాకులు తీసున్నారనే పుకార్లు నెల రోజులుగా వార్తల్లో నిలుస్తూ వైరల్ గా మారింది. అదే సమయంలో ఈ విషయంపై హార్దిక్ పాండ్యా మౌనం వహించడం వల్ల నటాషా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే.. నటాసా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో క్రిప్టిక్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో లో ట్రోలర్స్ పై ఆమె ఫైర్ అయినట్టు తెలుస్తోంది. విడాకులపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించడంతో ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హార్దిక్ పాండ్యా భార్య నటాసా స్టాంకోవిచ్ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేస్తూ నెటిజన్స్ పై విరుచుకుపడింది. "ఒక వ్యక్తిపై ఏదైనా రూమర్స్ వస్తే జనాలు వారిపై సానుభూతి చూపించకుండా త్వరగా తీర్పు చెప్పేస్తారు. మనం ఊహించలేని పని చేస్తే ప్రజలు మనల్ని అపార్థం చేసుకోవడంలో ఏ మాత్రం ఆలస్యం చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమందికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇలాంటి సమయంలో బాధగా అనిపిస్తుంది. ప్రజలకు ఎలాంటి సానుభూతి ఉండదు. ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకోకుండా నేరుగా తీర్పు చెప్పేస్తారు". అని హార్దిక్ పాండ్య భార్య నటాషా ఘాటుగా రిప్లై ఇచ్చారు.
హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో తెగతెంపులు చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పటికే ఈ జంట విడిపోయారని, విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కారనే ప్రచారం కూడా జరిగింది. అంతే కాదు విడాకుల అనంతరం పాండ్యా భరణం కింద భార్య నటాషాకు తన ఆస్తిలో 70 శాతం వాటా ఇవ్వనున్నట్లు ప్రచారం సాగింది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పాండ్య ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. జింబాబ్వే పర్యటనకు దూరమైన హార్దిక్.. జూలై నెలాఖరులో శ్రీలంకపై జరగబోయే సిరీస్ కు అందుబాటులోకి వస్తాడు.
Hardik Pandya’s wife finally breaks her silence on divorce rumors. 🤯
— Sann (@san_x_m) July 10, 2024
Guys, please watch before it gets deleted. 🙌#HardikPandya #NatasaStankovic pic.twitter.com/1QaPy7R9n8