టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు గురువారం (జూలై 18) ప్రకటించారు. ఇంస్టాగ్రామ్ లో తాము పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని తెలియజేశారు. ఇది తమకు కఠినమైన నిర్ణయమని.. తన కుమారుడు అగస్త్యకు మంచి తల్లిదండ్రులుగా ఉంటామన్నాడు పాండ్య. తమ ప్రైవసీకి భంగం కల్గించకుండా తమ నిర్ణయాన్ని గౌరవించాలని.. జీవితంలో తమకు సపోర్ట్ ఇవ్వాలని హార్దిక్ పాండ్య కోరాడు.
ప్రస్తుతం నటాషా కొడుకు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ కుమారుడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. "హ్యాపీయెస్ట్ బర్డే మై కవులి బావులి. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు". అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఒక చిత్రంలో ఆమె చేతుల్లో తన కొడుకు నిద్రపోతున్నాడు. ఒక కొత్త వీడియోలో, అగస్త్య మొక్కల దగ్గర బంతిని పట్టుకుని కనిపించాడు. మరో చిత్రంలో అగస్త్య ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాడు.
పెళ్లికి ముందే రెండేళ్లు డేటింగ్ చేసిన వీళ్లిద్దరు 2020 మే 31న పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులుగా పాండ్యా విడాకులపై వార్తలు వస్తున్నాయి. మార్చి 4న నటాషా పుట్టిన రోజు సోషల్ మీడియాలో తన భార్యకు పాండ్యా ఎలాంటి విషెష్ చెప్పలేదు. నటాషా కూడా తన ఇన్ స్టా అకౌంట్లో పాండ్యా అనే ఇంటిపేరును తొలగించింది. అప్పటి నుంచి వీళ్లు విడిపోయారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం పాండ్య శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్ కు సిద్ధమవుతున్నాడు.
#NatasaStankovic posts glimpses of her life in #Serbia with son #AgastyaPandya after eperation from #HardikPandya
— TIMES NOW (@TimesNow) July 19, 2024
Read More- https://t.co/qQD7gQgSPw pic.twitter.com/T65ImIhahx