
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో హైదరాబాద్ ఫార్మా కంపెనీ నాట్కో ఫార్మా ఏకీకృత నికర లాభం 83 శాతం పెరిగి రూ. 676 కోట్లకు చేరుకుంది. ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరం జులై–-సెప్టెంబర్ కాలంలో రూ.369 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.1,031 కోట్ల నుంచి రూ.1,371 కోట్లకు పెరిగిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎగుమతుల వ్యాపారం రెండవ క్వార్టర్లో కంపెనీ బలమైన వృద్ధిని కొనసాగించిందని నాట్కో ఫార్మా పేర్కొంది.